ఓమ్ నమ:శ్శివాయ నమ:
ఈశా…మహేశా…
మాంపాహి…మాంపాహి పరమేశా..
దయకనగరావయ్య జగదీశా…
దాక్షాయణీ హృదయ సోమేశా..!!ఈశా!!
నీ బిడ్డలమయా మేము…
మన్నించవయ్యా మా తప్పులనన్నిటినీ..
కలిమాయలో ఉన్నాము…
తొలగించవయ్యా కలిమబ్బు తెరలనీ….
మాకళ్ళతో చూసేము నీదివ్య సౌందర్యమును…
హృదయ వాకిళ్ళు తెరిచి స్వాగతించేము నీ మంగళ రూపమును….
విచ్చేయరా శంకరా…అతిథిగా కాకుండా…
ఉండిపోవయ్య శంకరా…మా గుండె గుడి దాటిపోకుండ…!!ఈశా!!
తెలియని పుణ్య ప్రకంపనలు మాలోన కలుగుతుంటే…
నవనాడులూ నీ నామ సంకీర్తనలు పలుకుతుంటే…
ఇంకెందుకంటుంది మా తనువు ఇంకొక్క జన్మ…
పొద్దు తెలియనంతగా వింటుంటే నీ గాన మధురిమ….
ఏమున్నదో ఏమో నీ నామ స్మరణలో…
మహర్షులమైతే చాలయా శివయ్య…దిగినాక నీ సేవలో…!!ఈశా!!
పాహిమాం..పాహిమాం…పరమేశ్వరా..
రక్షమామ్…రక్షమాం…సర్వేశ్