ఎందరో మహానుభావులు సాధించిన స్వాతంత్ర్య సమర ఫలం..

ఓమ్ నమ:శ్శివాయ నమ:

ఎందరో మహానుభావులు సాధించిన స్వాతంత్ర్య సమర ఫలం..
మన భరత మాత కలలుగన్న స్వేచ్చాయుత నోముఫలం..
నేడే.. నేడే.. గణ తంత్ర దినోత్సవం..
అవంతికలో జరిగె నేడు..భరతమాత రూపాన మహాకాళ మహోత్సవం…
జయహో…జయహో…భారతావనీ..
జయహో..జయహో..ప్రేమపావనీ…జయ ధీర శాలినీ…!!ఎందరో!!

శాంతి మంత్రమే ప్రథమ వేదమై…
హైందవ సంస్కృతియే దివ్య తేజమై..
పచ్చని సిరులనిచ్చు పంటచేల నిలయమై…
ఆకలిదప్పులు తీర్చే అన్నపూర్ణ రూపమై..
అలరారె నీదయతో భరతభూమి కానరా శంకరా…
ఆ సేతు హిమాచలము నుండి కన్యాకుమారి వరకు నీ ఆలయాలే మాకు రక్ష దేవరా…!!ఎందరో!!

దేశ ప్రజలంతా చల్లంగా వుండాలని..
అదృశ్య శత్రు భయము అంతటా తొలగిపోవాలని..
వేడుకొంటిమయా భరతమాత రూపాన నిన్ను మేము అలంకరించి..
జాతి సమైక్యతను తెలియజేస్తూ త్రివర్ణ పతాక పూల మాల సమర్పించి…
ప్రతి కంటిలో కనిపించాలని ఆనంద భాష్పాలు..
ప్రతి ఇంటిలో వినిపించాలని నీ మంగళ శ్లోకాలు…!!ఎందరో!!

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా..పాహిమాం..
రక్షమాం..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top