లాగేస్తుంది శంకరా..మా పాదము నీ గుడివైపుకి…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

లాగేస్తుంది శంకరా..మా పాదము నీ గుడివైపుకి…
మనసు లాగేస్తుంది కానరా.. నిను దర్శించడానికి…
ఇవ్వరా పరాత్పరా ..వేగమే ఆనతీ..
పరుగులెట్టైనా చేరేము నీ దరికి ఉమాపతీ…!!లాగే!!

కళ్ళు రెండూ పెద్ద పెద్దవిగా చేసుకొని…
మంగళకరమౌ నీ రూపమును కళ్ళ నిండ నింపుకొని…
పదిలపరచుకోమా భద్రంగా మా మది మందిరం మధ్యన…
అపురూపంగా కొలుచుకోమా నిన్ను మేము ధ్యాన యోగ ముద్రలోన..!!లాగే!!

గిరిజాపతీ నీ దివ్య సౌందర్యమే..
మా తల్లి పార్వతమ్మ హృదయము..
ఆ తల్లి శైలపుత్రి సౌభాగ్యమే
మహేశ్వరా..నీ నిండు హృదయము..
ఒకరికొకరు మీ ఇద్దరు ప్రణయ ప్రేమ మూర్తులు..
ఏ ఒకరిని దర్శించినా కనిపించే మీ ఇద్దరు ఈ సృష్టి మూలకర్తలు..!!లాగే!!

పాహిమాం… పాహిమాం… పరమేశ్వరా..పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top