ఓమ్ నమ:శ్శివాయ నమ:
ఒక్కసారైన దయచూపవా…శంకరా..నిను తలచుకుంటుంటే….
కడకొక్కసారైన పలుకవా… శంకరా…శంకరా అని మనసార పిలుచుకుంటుంటే…
కనిపించమని అడగ అర్హులము కాము…
కరుణించమని వేడుకొను భక్తులము మేము…
నీ భక్తులము మేము…అశక్తులము మేము…!!ఒక్కసారైన!!
ఏవిధమగు సేవలు చేయవలెనో..
ఏ తీరున యాగములు జరుపవలెనో…
ఏ కీర్తనను ఎటు కీర్తించవలెనో..
ఏ గానముతో నీ మది తాకనవునో..
తెలియకున్నది శంకరా..
మనసు దిగులుతో కుములుతున్నది భవహరా…!!ఒక్కసారైన!!
కరములను జోడించి కనులతో ఆర్తిగా భాషించగలవారము..
మనసునే గుడిచేసి భక్తితో సంతృప్తిగా ప్రార్ధించగలవారము…
ఇదే మా నిర్విరామya యాగమయ్యా…
నీకిదే మా భక్తి పద విన్యాస విరుల సరమయ్యా…!!ఒక్కసారైన!!
పాహిమాం..పాహిమాం..శివశంకరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం…అభయంకరా రక్షమాం…