ఓమ్ నమ:శ్శివాయ నమ:
విన్నవించుకోనా శంకరా…ఒక చిన్న విన్నపమును..
ఉంచమని మా గుండెలో నీ దివ్య రూపమును..
భక్తి ప్రకంపనలు క్షణ క్షణము లోలోన కలుగుతుంటే…
ఏ శక్తీ ఆపలేదు సన్మార్గమున మేము నడచుచుంటే…
విధి రాతనైనా చెరిపేయగలము..
ఆ బ్రహ్మ తో చెప్పి మహోన్నతముగ తిరిగి వ్రాయించుకోగలము…!!విన్న!!
నీ కృపా కటాక్షముల కంటే ఏముందయా శంకరా మాకు లోకాన ఎక్కువ…
నిండు మనసుతో పూజించితే తాపసులము కాకున్నా మాకు దక్కవా…
పయనిస్తూనే ఉంటాము నీ ఆరాధనా పురి దరి చేరు వరకూ…
పరితపిస్తూనే ఉంటాము నీ హృదయ ప్రపంచపు పురవీధులలో నివసించు కొరకు…!!విన్న!!
ఉత్తమోత్తమమైన జీవితమును గడపాలని…
లోకోత్తరమైన జన్మగా చరితలో మిగలాలని..
ప్రయాస పడి బ్రతుకుతుంటాము అందరం…
కర్మఫలముల వలలోన పడి బయట పడలేము తుదకెవ్వరం…
అనుభవించేవరకు ఎరుగమెవ్వరం గత జన్మ పాపాలని…
ఆశ చచ్చేవరకూ తెలుసుకోమెవ్వరం ఇవి కన్నీటి శాపాలని…!!విన్న!!
పాహిమాం..పాహిమామ్..శివశంకరా పాహిమాం…
రక్షమాం..రక్షమామ్..అభయంకరా రక్షమాం..