ఓమ్ నమ:శ్శివాయ నమ:
గణేష్ మహారాజ్ కి జై అందుమా…
బొజ్జ గణపయ్య పూజలకి సై అందుమా…
వక్రతుండుని ఎదుట గుంజీలు తీస్తుంటే..
ఏక దంతుని క్షణ క్షణము మనసార స్మరియిస్తువుంటే…
దీవించడా ఏడాదీ మొత్తమూ శ్రీరస్తు, శుభమస్తు మీకని
వరమియ్యడా నను తలచి చేయు కార్యమేదైనా సరే అవిఘ్నమస్తూ అని…!!గణేష్!!
ఇహలోకము, పరలోకము, ఏ లోకమైనా సరే….
తొలిపూజలన్నవి గణపతికి చేయాలి మొదలుఎవరైనా సరే…
అడుగు ముందుకేయాలంటే గుండె బలమవుతాడు విఘ్ననాధుడు…
కలలు నిజమవ్వాలంటే కార్యసిద్ధినవనిస్తాడు గణ నాధుడు..!!గణేష్!!
శక్తినివ్వలేదా వినాయకుడు ఎలుకకి..
మోయ తన స్థూల కాయమును..
భక్తితో సరితూగలేమా ఎలుకకి..
మోయ శక్తినిమ్మని కోర గణపతిని భవ బంధ భారములను…
కుడుములు, ఉండ్రాళ్ళ నైవేద్యములను ఆరగించి అరిగించుకొనినట్లే..
మన ఇడుములను, ఇక్కట్లను స్వీకరించి కరుణించడా మనము వేడుకొనినట్లే…!!గణేష్!!
పాహిమాం..పాహిమాం..గణనాయకా పాహిమామ్.
రక్షమామ్..రక్షమాం..సిద్ధి వినాయకా రక్షమాం..