చూడకయా శివా…చూడకయా అలా..
చూసి..చూసి నీ మాయలో పడేయకయా ఇలా…
ఏలనయా శివా…ఏలనయా అలా..
కోరి కోరి మమ్మాకట్టుకుంటావు ఇలా…
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
భక్తి పద నివేదనలు చేసేము రక్షించవయా శివా…రక్షమాం..
ప్రతిక్షణము మా కోసమే మదనపడతావు శివా…
ఆనందముగ మేముంటే కుదుట పడతావు శివా…
అరక్షణం మా గుండె బరువైతే బాధ పడతావు శివా…
నేనుండగా భయమెందుకని మా భుజము తడతావు శివా…
అంత ప్రేమను చూపు ఆదిశంకరా…
మేమెంత సేవలు చేస్తే నీ ఋణము తీరేనురా..[చూడ]
పుడమి తల్లి ఒడిలోన పూసిన పూలతో వచ్చాము…
ఆతల్లి కడుపున కాచిన పండ్లనే
తీసుకొచ్చాము…
మలినమైన మనసుతో ఇచ్చారని భావించకయా శివా….
మాలిన్యమే లేని భక్తి భావనతో అర్పించాము స్వీకరించవయా శివా…
ఇంతకన్నా నీ కివ్వ సంపదలు మా చెంత లేవు శివా…
ఆలపించి ఆరాధించగా రాగాలు మా కంతగా రావు శివా…
పాహిమాం..పాహిమాం..శివా…
పాల నీళ్ళంటి నీ తోటి బంధాన్ని రక్షించవా శివా….