గౌరీనందన గజముఖ వదనా….
మహి చల్లగ ఉండదా నీ దయవలన…
శంకరతనయా…షణ్ముఖ సోదరా..
మా తొలి తొలి పూజల దేవుడు నీవే కదరా…
మూషికవాహాన ముద్దు గణపతీ…..
మురిపెముగ అలరారెన నీ రూపాన మా ఉమాపతీ..
లోకాన్ని చుట్టి రమ్మంటే తలిదండ్రులే లోకమని చుట్టి…
మాతాపితరులే బిడ్డల లోకమని చాటినావు…
నీ ముద్దుమాటలతో ఆ పార్వతీపరమేశుల హృదయవీణలు మీటి మనసైన సుతునిగా గెలిచినావు..
సిద్దివినాయకా సద్భుద్దినియ్యవయా…
విఘ్నవినాయాక విఘ్నాలు దాటించవయా…
పార్వతీ పరమేశ్వరుల పరివారము పరిరక్షించుననువారము…
పెడదారిన నడచువారము మంచి మాటలు పెడచెవిన పెట్టువారము..
దండించవయా గణనాధా…నీ తొండముతో ప్రేమగా…
సరిదిద్దుకునేము విఘ్నరాజా…మేము దండము తో భక్తిగా…
పాహిమాం…పాహిమాం..పార్వతీటనయాయ పాహిమాం…
రక్షమాం…రక్షమాం..షణ్ముఖ ప్రియ సోదరాయా…రక్షమాం…