వందే మా తరం…నమో వందే ఈశ్వరాం..
సుజలాం..సుఫలాం..మలయజ శీతలాం…
నీ సుసంపన్న సృష్టి లో జీవించు జీవులం..
పాహిమాం…పాహిమాం…శివా…
ఈశ్వరాం..
రక్షించవా శివా…ప్రార్ధించగా ఈ తరం..వందే మాతరం..
ఈ గణతంత్ర దినమున.. నుదుటి పై త్రివర్ణ పతాక విభూతి రేఖలతో నీ దర్శనం…
భరత భూమికి ,భరత జాతికి అభయమిస్తివనుటకు నిదర్శనం…
జాతి,మతము,కులము,గోత్రము
లెరుగవు శివా..
జాతి పతాకపు వర్ణములే నీ వర్ణమని చాటెదవు శివా…
హైందవత్వము ప్రస్పుటించే భారతావని సంస్కృతని కాషాయ వర్ణమొక రేఖగా…
శాంతి కాముకుల కన్న భూమిగా శ్వేతవర్ణరేఖ ఒక గురుతుగా…
ఘనత కెక్కిన పసిడిపంటల భరతభూమిగా హరితవర్ణమును ఒక రేఖగా..
కరుణ చూపి కావరా…
ఈ భరతభూమిని దేవరా…
ఖర్మభూమిది కానరా…
ధన్యభూమిని చేయరా…
పాహిమాం.. పాహిమాం..పరమేశ్వరా..పాహిమాం..
రక్షమాం..రక్షమాం..పగవారినైనా మన పరివారమను భావించు దేశమిది..రక్షమాం..రక్షమాం..