నమో సౌందర్య రూపా..నమో సుందరేశా…
ఏలనో మాపైన నీకంత ప్రేమ జగదీశా..
కనులార్పక కాసేవు మము కాళేశ్వరా..
అలసిపోవునేమో నీ కనులు…పాపము నిదుర లేక..
చిరునగవులాపవు…సర్వేశ్వరా…
సొలసిపోవునేమో నీ పెదవులు చల్లని వెన్నెల వరములు కురియలేక….
పాహిమాం..పాహిమాం..శివా…పాహిమాం..పాహిమాం..
రక్షమాం..రక్షమాం..శివా..మా కోసమై వెలిసిన శివా..రక్షమాం..రక్షమాం..
తదేకముగ తిలకిస్తే శివా..నీ రూపమే..
వైదొలగదా శివా..నువ్వు వరమిస్తే మా పాపమే…
అదేపనిగా చేస్తూంటే నీ ధ్యానమే…
పూనీతమవదా శివా మా ప్రాణమే…
హేమంత మాసానా మేమెంత పూజించినా…
రవ్వంత చోటిస్తేనే కదరా నీ మదిన మా పూజఫలియించ త్రినయనా…
మొక్కవోని దీక్షతో మొక్కేము శివా…
లెక్కలేనన్ని సేవలే చేసేము శివా…
గరిటెడు గంగకే ఆశపడు బంగారు మనసు నీది…
చిటికెడు విభూది కే సంబరపడి వరమిచ్చు సంస్కారమే నీది…
ఆశీస్సులియ్యవయా ఆదిశంకరా…
శుభాశీస్సులియ్యవయా శివశంకరా…