శివ శివా అని ప్రార్ధించుచున్నాము..

శివ శివా అని ప్రార్ధించుచున్నాము..
ఓసారి పరికించు ఓ ధ్యాన మూర్తీ…
హర హరా అని ఎలుగెత్తి పిలిచేము…
చెవులారా వినవయా మా సాంబమూర్తి..

నుదుటి పై దిద్దారు పూజారులు అందముగ మారేడు దళములు
 నీకిష్టమని….
 వారు నీఎదుట ఉంచారు ఏరేరి వేర్వేరు ఫలములు నైవెద్యముగ గైకొనమని…
భక్తితో అర్పించిన భక్తులందరూ…
శక్తి వంచన లేక కొలుచుమందురు…
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా…
మౌనమును వీడి మముకావ రారా సర్వేశ్వరా…

పట్టువస్త్రములు నీకు అర్పించినా…
పుట్టతేనెల సిరులు
నీ ముందుంచినా….
పట్టుమని ఘడియైన ఆగవు…
సరిపెట్టుకొని స్నేహితుడివవుతావు…
ఆ ఆత్రములో మా ప్రేమ పాత్రుడవవుతావు….
విచిత్రమేమిటో శివా.. తలచిన వెంటనే మా కళ్లముందు కొస్తావు….
చాలురా శివా చాలురా ఈ ఒక్క వరమే చాలురా…
వేల జన్మలెందుకురా శివా…ఈ ఒక్క జన్మ చాలురా..
పాహిమాం..శివా…పాహిమాం..పాహిమాం…
రక్షమాం…శివా రక్షమాం..రక్షింప మము నిను వినా మాకెవరు రా శివా..రక్షమాం..

Leave a Comment

Scroll to Top