నారీశ్వరం సగం..నాగేశ్వరం సగం…

నారీశ్వరం సగం..నాగేశ్వరం సగం…
కనగ శివ పార్వతుల సంయోగ వైభవం…
కలతలన్నవి తెలియునా ఏ ప్రాణికైనా..అది అసంభవం..
శివాని వై కోమలత్వము ఒక వైపు..
శివునివై కరుణత్వము ఒక వైపు..
వెరశి మీ ఇరువురి ప్రేమతత్వము మా వైపు…
ఆర్థితో స్పందించని హృదయముండునా శివా చూసి మీ వైపు…

లింగభేదాలు తనువులకేనని…
సృష్టి లో స్త్రీ పురుషులిద్దరూ ఒకటేనని..
చాటావుగా శివా అర్దనారీశ్వరునివై..
నిలిచావుగా శివా..నగ్న సత్యానివై
అమ్మా శివాని అని అడగనా…నీ ముక్కెరలో ముత్యమౌ వరమివ్వమని..
తల్లీ భవానీ అని అడగనా..నీ సిగలో  పూరెక్కనవుతానని…

తండ్రీ శివా…అని కోరేను నిన్ను నీ నుదుటి విభూది రేఖలో రేణువవ్వాలని..
కాళేశ్వరా..కానా నేను నీ కాలి మువ్వల సవ్వడినని..

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
సతీ సమేత సమ్మిళిత దర్శన శివం..రక్ష మాం..రక్షమాం…

Leave a Comment

Scroll to Top