రోజు కొక రూపము…రూపానికొక భావము…

రోజు కొక రూపము…రూపానికొక భావము…
కనగ శివుని వైభవము…అది మీకే కదా సంభవము…
ఉజ్జయినీ పుణ్య పురమున పుట్టిన విప్రోత్తములారా…
మీ నైపుణ్యమును వెలకట్ట గల వారు ఇలన ఎవరైనా కలరా…
మీ పుణ్యమా అని ఆ పుణ్యమూర్తిని దర్శించుకుంటున్నాము వివిధరూపాలలో…
ఏ జన్మ వరమోనని ఆ సాంబమూర్తిని స్మరించుకుంటున్నాము పరి పరి విధములలో…..
ఆ స్వామితో ముడిపడిన ఈ బంధం కలకాలముండాలనీ…
మా తండ్రికి ఋణపడిన సంబంధమై తుది దాకా కొనసాగాలనీ..
మా మనవిని విపులముగా విశ్వేశ్వరునికి విన్నవించరా విప్రులారా…
ఉపేక్షించక వెంటనే ఉజ్జయినీ శివ ప్రియ పుత్రులారా…
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా.
నీ చల్లని ఆశీస్సుల ప్రతిస్పందనలను కోరేము కరుణించరా….

Leave a Comment

Scroll to Top