శంకరా శివా…శివ శంకరా శివా…
శంభో మహాదేవ శంకరా శివా…
వందనం శివా..శివా వందనం శివా…
వందే గణనాధ శివ వందనం శివా…
వక్రతుండ ముఖ గణేశ శంకరా…
వక్రమార్గము నుండి మము తప్పించరా..
ఏకదంత వినాయక శంకరా..
ఏమరుపాటున కూడా నిను మరువని వరమియ్యరా…
విఘ్నాలు కలగనియ్యక పయనించనీ శివా మమ్ము విజయతీరాల వైపు…
భఙమైన ( bhagna maina) మా కలలను సాధించగా శివా మాకు గెలుపు పాఠాలను నేరుపు…
వెనకుండి నడిపించరా శివా…కష్టాల కొండలెన్నైన పిండి చేసేము..
ఏమంత పనికాదురా శివా..నీ దయ ఉంటే బాధలు బండెడైన మోసేము…
నువ్వున్నావన్న సత్యమే మమ్ము బ్రతకనిస్తుంది..
తోడున్నావన్న ధైర్యమే మమ్ము నడవనిస్తుంది…
వమ్ము కానీయకయా శివా మా నమ్మకాన్ని…
కొమ్ము కాసే దైవమా…చేరనీయవయా మము మా గమ్యాన్ని…
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
ప్రతి దినము పలు మార్లు నిను తలచు వరమియ్యరా విశ్వేశ్వరా….