ఉజ్జయినీ పురహరా..నిత్యదర్శన భాగ్యమిచ్చిన నిరాకారా….

ఉజ్జయినీ పురహరా..నిత్యదర్శన భాగ్యమిచ్చిన నిరాకారా….
శ్రీ కాళేశ్వర నామ హరా..కామితార్ఠ ఫలములిచ్చు శ్రీ కాళ హరా…
దేదీప్యమాన దివ్యాలంకరా శోభిత…
నానావిధ పరిమళ పుష్పవస్త్రాభరణా భూషితా…
పాహిమాం..పాహిమాం..శివశంకరా…
రక్షమాం..రక్షమాం..అభయంకరా..

కాల కూటవిషమును మింగి కాలమును నడిపిస్తున్నావు…
మా బాధలను నువ్వు దిగమింగి మమ్ము ఓదారుస్తున్నావు…
సురులను కాపాడినావు
గరళకంఠుడివై…
నరులను కాపాడుతున్నావు నీలకంఠుడివై…
అమ్మను మించి ప్రేమను పంచు దేవరా..
నిన్ను మించిన దైవమెవరు మాకు ఈశ్వరా…
చెలికాని వోలే చొరవతో నిను పిలిచినా..
చుట్టానివోలే ఏ వరుస తో నిను పిలిచినా…
బేధభావాలెంచవు శివా…
రాగ ద్వేషాలుండవు శివా…
అందుకే శివా..నువ్వు మా మనసుకు అంత దగ్గరయ్యావు…
ఇలలోన ప్రతి ఇంట ఇష్ట
దైవమయ్యావు…

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..పాహిమాం…
రక్షమాం..రక్షమాం..రుద్రాభిషేక ప్రియా…రక్షమాం…

Leave a Comment

Scroll to Top