జయ జయ శంకర…జయ జగదీశ్వర

జయ జయ శంకర…జయ జగదీశ్వర
అణువణువు నువ్వున్నది సత్యమే కదరా…
హర హర శంకర..ఉమ హృదయేశ్వర
నీ ముంగిట నిలిచిన ఈ ప్రాణం నీదే కదరా…
ఓంకారరూప ఒకపరి రావా…
శాంకరి పతి శివ..వరమిడి పోవా…

సిగపైన చంద్రన్న సింగారమై..
మెడలోన నాగన్న మణిహారమై..
గంగతానాలాడు గంగాధరా…
మా బెంగ తీర్చగ రావా హిమగిరి దొర…

అతిధిగా రాకయ్య శివా పిలిచామని…
బంధువై దిగకయ్య శివా కొలిచామని..
కొలువుండిపోవయ్య శివా గుండెలో గుండెవై శాశ్వితముగ…
అందుకొనగ మా ఉచ్వాస నిశ్వాసల మంత్రోచ్చరణలు నిరంతరముగ
పాహిమాం…పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా…
పరమ పావనమైన నీ పద స్పర్శతో తరించనీవయా సర్వేశ్వరా…

Leave a Comment

Scroll to Top