గజముఖ వదనా..గౌరీ శంకరా…

గజముఖ వదనా..గౌరీ శంకరా…
నీకభిముఖముగ నే నిలబడ తగునా…
కరిచర్మాంబర..కాశీపురహరా..
కలలోనైనా నిను కనగలనా త్రినయనా..
ఇది మా మనవే అనుకో శివా…
మా వేదన అని అనుకో శివా…
పాహిమాం..పాహిమాం..శివా..
రక్షమాం..రక్షమాం..శివా…

కళ్లిచ్చిన తండ్రివి కనిపించవు ఎందుకయా శివా….
ఎదుటి మనిషి కష్టాన్ని చూసిన మా కళ్లు.. ఒక్క కన్నీటి చుక్కనైనా రాల్చనందుకా..
మాటిచ్చిన వాడివి.. మాటలాడవెందుకయా శివా..
పరుషపదములు వాడి మా పెదవులు అదుపు తప్పినందుకా…
స్పందించని కళ్లను సరిద్దిద్దవయా శివా…
మాటల తీరుని మన్నించవయా శివా…
చెలిమివై ఉండవా శివా…మా కలిమివై ఉండవా శివా…
మా తనువు,మా మనసు నీ వశము చేసేము..మార్చేయవయా శివా…
పరవశము తో నిను గాంచి పదకీర్తనలు కీర్తించి తరించనియవయా శివా…

పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా…
ప్రతి క్షణము నీ ధ్యాసలో జీవించు వరమియ్యవయా శివా…

Leave a Comment

Scroll to Top