కలడందురు శివుడు…

కలడందురు శివుడు…
కనులకు కనిపించుడందురు…
వినుడందురు శివుడు…
జనుల మొరలు వినుడందురు…
ఆత్మశుద్ది లేని వారిమని అపహసించక…
ఙాన శుద్ది లేని వారిమని పరిహసించక…
పరుగున రారా శివా…పాప పుణ్యము లెన్నక…
హిమగిరి దిగిరారా శివా…మీనమేషాలు లెక్కించక…

ప్రలోభాల ప్రపంచములో బ్రతుకుతున్నామయా శివా…
స్వలాభాలే లక్ష్యమై జీవించుచున్నామయా శివా…
బ్రతుకు పోరాటం లో బంధుత్వాలు వదులుకుంటున్నాము….
ఆశల ఆరాటం లో శతృత్వాలు కొని తెచ్చుకుంటున్నాము….
ఇందుకా శివా..ఇచ్చావు మాకు ఈ జన్మ…
ఏ జన్మ పాపఫలమయా శివా…ఈ ఖర్మ…
ఈ జన్మతో తీరనీ శివా..మా గతజన్మ పాపాలు…
మరుజన్మ లేకుండ వరమిస్తే చాలు శివా…నీకు వేల దండాలు…
పాహిమాం..పాహిమాం…పరమేశ్వరా..పాహిమాం…
నీ నంది కాలి గిట్టనై పుట్టినా చాలురా శివా నేను…రక్షమాం…రక్షమాం…

Leave a Comment

Scroll to Top