హర హర హర శంభో…
మా కాశీ పుర వర హార శంభో…
ఏలనయా శివా నేడు నీ కళ్లు ఎర్రనా
రేపవలు మము కాచి అవి ఎరుపెక్కెనా..
అయినా సన్నని చిరునవ్వు శివా నీ మోమున…
ఎటులైనా మాకు వరమివ్వు తీరునా..
శివాయా..శివాయా..శివాయా..పాహిమాం..
హరాయా..హరాయ..హరయా..రక్షమాం..
ఎప్పుడూ మా మీదనే శివా నీకు ఆసక్తి..
సరితూగునా శివా…నీ ప్రేమకు మా లోని ఈ భక్తి…
మాటరాదు కదా శివా మారేడా నిను కీర్తించ..
మౌనభాషలే కదా శివా సదా నిను ప్రస్తుతించ…
మా భాషలో భావాన్ని అవగతం చేసుకో శివా…
ఆ భావాన్ని బంధముగ అనునయం చేసుకో శివా…
ఊరకనే వరములిచ్చువాడివి…
ఉసిరికాయలు గొప్పవనువాడివి…
పిలవగనే పలుకువాడివి…
ఫలపుష్పములు చాలనువాడివి…
ఎంత దయరా శివా…ఇలపైన.
మరువగలమా శివా..మేము నిను కలనైనా…
పాహిమాం..పాహిమాం..శివా..పాహిమాం..
రక్షమాం..రక్షమాం..శివా…రక్షమాం..