తొలి రవికిరణము నేలను తాకుచుండగా…

తొలి రవికిరణము నేలను తాకుచుండగా…
అల కోయిల తొలి పలుకులు పలుకుచుండగా…
పసిమొగ్గలు నీ పూజకు వికసించు చుండగా…
ప్రకృతి కాంత పచ్చని తివాచీలు పరచి స్వాగతములు పలుకచుండగా…
అరుదెంచితివా శివా…అతిసుందర ముగ్ధమనోహర మందస్మిత మంజుల మురళీ రూపమై మము కావగా….
ప్రస్తుతించదా శివా పుడమి…నీ మంగళకర సుమ సౌందర్య మోహన రూప ప్రాభవ వైభవాన్ని వచన కావ్యమై ఆ బ్రహ్మ వ్రాయగా…
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..మురళీకృష్ణ రూప శివం..రక్షమాం…

గోపెమ్మల మనసు దోచుకున్నాడు శివా నల్లనయ్య…
మా మనసెరిగి మము కావ శివా…నీకు జాగేలనయ్య…
గోవుల కాచి గోవర్ధన గిరినెత్తిన పరమాత్మునిగా అందుకోవయ్య లీలా మోహన రూపా మా పరిపూర్ణ తులసీదళ పూజార్చనలు…
జగమును రక్షింప కైలాసగిరినైనా  తరలి వచ్చే కాళేశ్వరా.. చేసుకోనియ్యవయా మము..మా సంపూర్ణ సేవల శతకోటి భస్మాభిషేకాలు…
గీతను బోధించిన గోవిందునిగా మా కనులముందు నువ్వున్నా…
మా రాతలు రాసిన నీ మనసు కూడా వెన్నేకదా శివన్నా….
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం..
పాడి పంటలు,పశుసంపదల నొసగు సర్వేశ్వరా రక్షమాం…రక్షమాం..

Leave a Comment

Scroll to Top