ఓం..నమః శివాయ…శివ-శక్తి స్వరూపాయా…

అర్ధనారీశ్వరాయ..అద్వైత మూర్తాయా…
ఆదిపరాశక్తీశా..పాహిమాం..పాహిమాం
త్రినయన లోకేశా రక్షమాం..రక్షమాం..

అమ్మవని కీర్తించమా శివా..అయ్యవని ప్రార్ధించమా శివా…
అమ్మవై,అయ్యవై అలరించు అర్ధనారీశ్వరునివని అర్థించమా శివా…
భక్తులే బంధమై ప్రేమించు దివ్యశక్తి నీదని ప్రాణమై పూజించమా శివా…
విశాల నేత్రాలతో వీక్షించవయా శివా మా బాధలు…
సువిశాల మనసుతో సమీక్షించవయా     శివా ఓ సారి మా గాధలు…
లోతుగా అద్యయనం చేసి మా లోపాలను సరిదిద్దవయా శివా…
ప్రేమగా పఠనం చేసి మా పాపాలను ఎడబాయావయా శివా…
త్రినేత్రముతో మము వీక్షించకయా శివా…
తృణప్రాయులము మేము త్రయంబకేశ్వరా…
మనోనేత్రముతో తిలకించవయా శివా..
మా మది నలుమూలల నీ ప్రతిబింబము లే కదా కేదారేశ్వరా…
నిత్యమూ సంఘర్షణే శివా మాకు..
ఎటులైతే నీకు   ఆకర్షితులమవగలమోనని…
అనునిత్యమూ అంతర్మథనమే శివా మాలో..
ఎపుడు నీ మదిన స్థానమిత్తువోనని…

పాహిమాం…పాహిమాం…పాహిమాం..శివా..
పాపం..నా బిడ్డలని మము నీ గుండెకు హత్తుకోవా శివా…

Leave a Comment

Scroll to Top