ఎంతవరమొందితిమోనయా శివా…నిత్యమూ నినుకన .
మాకెంత భాగ్యమోనయా శివా…ప్రతి నిత్యమూ చేయగా నీ ఆరాధన…
ఈ రీతిన మము దయగనిన పరమేశ్వరా….
ఏ రీతిన ముదమవగలమో శలవియ్యరా….
పాహిమాం..శివా..పాహిమాం..పాహిమాం…
రక్షమాం..శివా..రక్షమాం..రక్షమాం…
అలసిపొయివుంటావు కదా శివా..రోజంతా అందరి బాధలు వినివిని…
మనసు కరిగిపోయి వుంటుంది కదా శివా…మా అందరి గాధలు తెలుసుకొని…
విశ్రమించవయా శివా కాసేపు..మా హృదయతల్పముపై …
సేదతీరవయా శివా… పొద్దు పొడిచె లోపు… పసిపాపvai..
జోల పాడేము నీకు నిదురించరా శివా..
సడి చేయకుండా aadamarachi శయనించరా శివా..
పదములొత్తేము నీకు పవళించరా శివా…
నీ పుణ్య పాదాలు కందితే మన్నించరా శివా…
నీ సేవలో తరియించు ఈ తనువుకి..
ఇంతకన్నా ఏం కావాలి శివా ఈ జన్మకీ..
ధన్యోశ్మి శివా…ధన్యోశ్మి…
కైలాసవాసా…మనసాస్మరామి..