అమ్మా.. శర్వాణీ..

అమ్మా.. శర్వాణీ..
మాతా… కాత్యాయినీ…
జననీ..శుభకారిణీ…
శంభో..శివ శివానీ…
అందుకోవమ్మ ఈ ఆనంద నయనాల హారతులు…
పుచ్చుకోవమ్మ మది పాడిన కృతజ్ఞతల గీతాలు..!!అమ్మా!!

విరచించిన గీతాలకు పరవశించి నీ పెనిమిటి  ఇచ్చినాడు కానుక…
ప్రభవించిన పదములు నీ ప్రభువివనే తెలిసి తన ప్రేమ చాటినాడు ఈ భక్తునిపై కనిపించక..!!అమ్మా!!

పంపినాడు దూతని…
మార్చేసి తలరాతనీ..
పుణ్య  అనుభూతికి లోనైనదీ  ఈ చిన్ని  మానసమూ..
ధన్యచరితునిగ చేసినట్టి శివ శంకర మానసము…!!అమ్మా!!

పాహిమామ్…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వర రక్షమాం..

Leave a Comment

Scroll to Top