రేపేకదా శంకరా…నీ పండుగ శివరాతిరి..

ఓమ్ నమ:శ్శివాయ నమ:

రేపేకదా శంకరా…నీ పండుగ శివరాతిరి..
ఆనందమున నిదుర పట్టునా మాకు ఈ రాతిరి…
ఎపుడెపుడు తెలవారుతుందాఅనీ
తొలిపొద్దునే నిను దర్శించుకోవాలని..
తన్మయత్వాన తనువు నిదుర పోకున్నది….
నిదురపోతే మదిని తట్టి లేపమన్నది..!!రేపే!!

కోసుకొని వచ్చేము నాల్గు మారేడు దళములు…
మోసుకొని వచ్చేము బిందెతో గంగ తీర్థమ్ములు…
ధారాపాతముగ భక్తితో నీ శిరముపై పోసి…
మా దాక్షయణీపతీ నీకు విభూతి రాసి…
వుంచి మారేడు దళములు…
మేమొంచి మా శిరములు..
పొందమా పండగేళ పరమేశ్వరా నీ దీవెనలు…
చేయమా ధ్యానము ఉదయాస్తమానములు చేసి నీ  ఉపవాసములు..!!రేపే!!

తిరునాళ్ళ సందళ్ళు కనులలో కదలుతున్నాయయా…
ఆ తిరునాళ్ళ చిరుతిళ్ళ అంగళ్ళు కనుముందు కదలుతున్నాయయా..
తెలవారనీ శంకరా..త్వర త్వరగ ఈ పొద్దుని…
మా కలనేరవేరనీ శంకరా…తీర్చుకొనగ మా మొక్కుని…!!రేపే!!

పాహిమాం..పాహిమాం..శివశంకరా.. పాహిమామ్..
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top