మూడు కన్నుల వాడు…మారేడు దళ ప్రియుడు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

మూడు కన్నుల వాడు…మారేడు దళ ప్రియుడు…
పిలవగనే పలికేటి పరమేశ్వరుండు..
రండి రండంటూ పిలిచేను..అందుకొమ్మని దేవెనలను  తన కనులు రెండు…
ఎదురు చూస్తున్నాయి మనకోసము..
ఓదార్పునివ్వంగ బాధాతప్త హృదయాల కోసము..!!మూడు!!

శోకమును శ్లోకముగ మలచి…
వేదనను నివేదనముగ మార్చి…
వేడుకుంటే చాలు వెండి కొండల వాడిని…
విన్నవించుకుంటే చాలు నిండు మనసు గల నిటాలాక్షుని..
అదృశ్యమయ్యేను ఆపదలు మనకెన్ని వున్నా…
తండ్రిలా కాపాడు దేవుడే కదా మన శివన్న…!!మూడు!!

విధిరాతకు కలత చెందవద్దనీ…(padavaladani)
పాప కర్మల బెడద మీకేలని..
వేయండి భారమును నా పైన అంటూ…
చేస్తేనే చాలు నా నామ స్మరణను మీరందరూ అంటూ…
కదలి వచ్చాడంట కాళేశ్వరుడు కైలాసమును వీడి..
చేరి పోయాడంట వరములియ్యంగ తొలిసంధ్యలోనే తన గుడి…
గంగతో కడిగేము అందరమూ ఆ తండ్రి పాదారవిందములు..
అపర భక్తితో తాకేము పరవశము చెంది శివ హృదయ అందలములు…!!మూడు!!

పాహిమాం… పాహిమాం..పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top