ఓమ్ నమ:శ్శివాయ నమ:
అహో…శ్రీ సిద్ధివినాయకా…
కైలాస ప్రమద గణ నాయకా…
అందుకోవయ్య మా మొట్టమొదటీ పూజలు….
మరువబోమయ్య చిట్టచివరీవరకు నీ సేవలు….
కదలి రారా…లంబోదరా…
వరములియ్యంగ గౌరీ కుమారా..!!అహో!!
వక్రతుండుడవై తొలిపూజ వరమొందినావు…
ఏక దంతుడవై మహా భారతమును రచియించినావు…
సంగీత సాహిత్యములందు సాటిలేరంటూ నాట్య గణపతిగ అవతరించావు…
సిరిసంపదలనొసగంగ నాకు నేనే మేటంటూ లక్ష్మి గణపతివై వెలిసినావు…
కదలి రారా లంబోదరా…
వరములియ్యంగ గౌరీ కుమారా..!!అహో!!
చలువ పందిళ్ళకంటె చల్లనైనది నీ మనసు…
తీపి కుడుములకంటే తీయనైనదనీ తెలుసు….
విఘ్నాలు బాపరా గణపతీ…
విజయాలు చేకూర్చరా మా సిద్ధి గణపతి…వరసిద్ధి గణపతి…
కదలి రారా …లంబోదరా…
వరములియ్యంగ గౌరీ కుమారా!!అహో!!
పాహిమాం…పాహిమాం.. విఘ్నేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం…సిద్ధి బుద్ధి ప్రదాయకా రక్షమాం….