ఆనందమాయెరా శంకరా…ప్రేమ కనులతో నీ పలకరింపు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

ఆనందమాయెరా శంకరా…ప్రేమ కనులతో నీ పలకరింపు…
పరమానందమాయెరా హర హరా..మధుర ధరహాసములు కురిపించు నీ నగుమోము చూస్తుంటే మా వైపు…
అడిగినట్లుంది మా యోగ క్షేమ సమాచారములు..
ఆలకించుచున్నట్లున్నది చెబుతుంటే మా జవాబుల విన్నపములు…
శంభో హరా శంకరా…మా సర్వం నీవే కదా గంగాధరా…!!ఆనంద!!

వచ్చి కూర్చున్నావు కైలాసము నుండి ఇలపైన లింగమై…
వరములియ్యంగ నిలిచి పోయావు ఊరువాడలా దైవ బంధమై…
చెప్పుకొనవస్తారు కష్టసుఖములను ముక్కంటి మా వాడనీ…
మనసు విప్పుకొన వస్తారు..ఎవరితో చెప్పుకోలేని వేదనలను నీతోటి పంచుకోవాలని..!!ఆనంద!!

తలచేరు.. చెప్పుకున్నాక నీతోన..తీరింది తమ భారమెంతోనని…
కొలిచేరు…కాంతులీనే నీ కరుణ కిరణాలు తాకాక దేవుడంటే శివుడేననీ…
కానరా..ఆ దీన జనులా మోములు..
కనిపించు ఆ కళ్ళలో నీ దీవెనల వెలుగు వెన్నెల మతాబులు…
శంభో హరా శంకరా…మా సర్వం నీవే కదా గంగాధరా..!!ఆనంద!!

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top