పిలిచేనయా శంకరా..నీ కన్నులు

ఓమ్ నమ:శ్శివాయ నమ:

పిలిచేనయా శంకరా..నీ కన్నులు
దర్శించుకొని తీసుకొనిపొమ్మని నీ ఆశీస్సులు…
మదిని తాకేనయా నీ కంటి కరుణ చూపులు…
 స్పృశించేనయా తెరచి మా గుండె గుడి తలుపులు…!!పిలిచే!!

ఎన్నాళ్ళని, ఎన్నేళ్ళని ఎదురుచూసేవయ్య గుడిలోన మా కోసము…
ఏ బంధమై వెలిశావు ఏమో… ఈ భూమిపై కావంగ ప్రతి నిత్యము..
నిత్యదర్శనమునిచ్చి అందరినీ ఋణగ్రస్తుల్ని చేస్తున్నావు…
కొరకనే వరములిచ్చి సమస్తమునూ దీవిస్తున్నావు…!!పిలిచే!!

ఎటుల తీర్చగలము నీ ఋణము వరములిస్తూ..ఇస్తూ ఉంటుంటే..
ఏ తీరున విముక్తులగుదుము మేరునగమై నీ ఋణము పెరిపోతూ వుంటుంటే…
సరిపోదయా ఈ జన్మ తీర్చవలెనంటే కొండంత నీ ఋణము…
ఎన్ని జన్మలెత్తవలెనో ఏమో
తీర్చవలెనంటే నీ ఋణము…ఈ మూగ ప్రాణము..!!పిలిచే!!

పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top