ఇవ్వరా శంకరా ఇంకాస్త శక్తిని..

ఇవ్వరా శంకరా ఇంకాస్త శక్తిని..
చూపింతు నీ పైన నాకున్న మరింత భక్తిని…
ఆలకించరా ప్రస్తుతించేను నీ కీర్తిని…
పరమేశ్వరా…దీవించి ప్రసాదించు నాకు ముక్తిని….!!ఇవ్వరా!!

సాగించుటే కష్టము మనుగడను ఈ భూతలముపై…
సాధించుటే సులభము..మోక్షమును భక్తితో పూలొంచి మొక్కితే నీ పాదపద్మాలపై..
ఎంచుకున్నానయా నడవంగ నీ భక్తి మార్గమునను…
శిరమొంచి మొక్కేమయా వెలిగించు మాలోన జ్ఞానజ్యోతులను…!!ఇవ్వరా!!

ఆశావహులమై ఉన్నాము అందరిని ఆదుకుంటావనీ…
జారి పడిపోకుండ కలిమాయలో…చేయందించి గట్టిగా పట్టుకుంటావని..
చేయూతనందిస్తే చాలురా ఈశ్వరా…
చేరుకుంటాము..ఏనాటికైనా నీ పుణ్యతీరాలు పరమేశ్వరా…!!ఇవ్వరా!!

పాహిమాం… పాహిమాం… పరమేశ్వరా… పాహిమాం..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top