కనిపించని దైవమా…కాళేశ్వర లింగమా…
కరుణించగ జగతిని..ఉజ్జయినిలో వెలసిన ప్రతి రూపమా..
వేనవేల దండాలు పెట్టేము నీకయా…
భక్తి కుసుమ మాల దండలు వేసేము నీకయా…
శంభో హర శంకరా…నీలకంఠుడా..
గంగా ఝరి ప్రళయ ఘోష నాపి కాచినట్టి గంగాధరుడా…!!కని!!
మంచుకొండలందు ఉన్న జంగమా..
మా హృదయమందు వెలుగు ప్రాణ దీపమా…
సూర్యచంద్ర నయన రూప తేజమా..
మా చీకట్లను రూపు మాపి కావుమా..!!కని!!
ఎంతో వ్యధ చెందు వారి ప్రాణ నేస్తమా…
నీ చరణాలే శరణమన్న వారిపైన జాలి చూపు లింగమా…
ఏమాశించక వరములిచ్చు దైవ బంధమా..
నీకేమవుతామని మా పైన కరుణ చూపు కారుణ్య రూపమా…!!కని!!
పాహిమాం.. పాహిమాం.. పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వర రక్షమాం..