ఓమ్ నమ:శ్శివాయ నమ:
నిండు పౌర్ణమి నాడు చంద్రబింబము మెరిసె నీ నుదుటిపై…
పండు వెన్నెల లాంటి నీ కరుణ కిరణాలు ప్రసరించరా శంకరా..ఈ పుడమిపై…
మాఘపున్నమిన ప్రకాశించనీ లోకము…
ఆగమేఘాల మీద జగము నివేదించ నీ స్తోత్రము…!!నిండు!!
వచ్చి కూర్చున్నట్లుంటావు కైలాసము వీడి ఉజ్జయిని గుడిలోన..
ఏమిచ్చి తీర్చుకొనము నీ ఋణము….
ఇచ్చేవు దర్శనము మాకొరకు ప్రతి తొలి సంధ్య పొద్దున…
సృష్టినే సృష్టించిన సర్వేశ్వరా…
నీ దృష్టినెప్పుడూ ఇట్లాగే మాపైన సారించరా ఈశ్వరా…!!నిండు!!
కరుణా సముద్రుడవని నిన్నందురే…
ఎన్ని సంద్రాలు కావాలి కొలవంగ నీ కరుణని…
దయా హృదయుడవని నిన్నందురే…
నీ హృదయ వైశాల్యమడగతరమా మాకు నీ మనసుని…
శంకరా…మా కొరకు భువిలోన
కైలాసమును మరియొకటి నిర్మించవయ్యా..
ఈ దీనుల మొర ఆలకించి దయచూడ ధరణిపై నడయాడ తరలిరావయ్య…!!నిండు!!
పాహిమాం… పాహిమాం.. పరమేశ్వరా… పాహిమాం
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…