ఓమ్ నమ:శ్శివాయ నమ:
ఎక్కడున్నదో కాస్తంత వెతికిపెట్టవయ్యా శంకరా..నా మది..
నీ గుడికి చేరినప్పటినుండి ఎంత వెదికినా కనిపించకుండా ఉందది…
ఎంత తొందరో దానికి చేరాలని నీ గర్భగుడి…
చేరి పూలొంచి మొక్కుకొవాలనుకున్నదేమో నీ పాదాలపై బడి..
దీవించరా శంకరా..
నీ కరుణ కిరణాలు తనపైన ప్రసరించరా శంకరా..!!ఎక్కడు!!
చొచ్చుకొని పోతావు ప్రతి మనిషి హృదయాంతరంగాలలో…
తనువు నీ స్వాధీనమయ్యాక ఉండవే ఇంద్రియములు మా ఆధీనములలో..
ఆత్మ నీదే కదా శంకరా….
దాని పరమాత్మ నీవే కదా..శంకరా..
ఆడించునది నీవే…ఓడించునదీ నీవే…
నిన్ను నమ్మి పోరాడితే…ఆట గెలిపించునదీ నీవే..!!ఎక్కడున్నదో!!
చూస్తేనే చాలయా నీ కంటి కరుణ చూపులు…
పుణ్యచరితులై పోరా వెనువెంటనే పాపులు…
తెలుసుకొని తమ తప్పొప్పుల నడతని…
ఆ జన్మాంతమూ తలచుకోరా నీ ప్రేమనీ…
ఉపదేశిస్తూ ఒకవైపు నీ పంచాక్షరీ మంత్ర సారముని…
కొనసాగిస్తూ సాగని..ఇంకో వైపు ఆగని జీవనప్రయాణాన్ని…
తపియించనీ ఈ తనువు నీ సేవకై…
మళ్ళి జన్మించినా చేయలేనంత సేవ చేయు వరము పొందుకై…!!ఎక్కడున్నదో!!
పాహిమాం… పాహిమాం.. పరమేశ్వరా… పాహిమాం..
రక్షమాం… రక్షమాం.. సర్వేశ్వరా.. రక్షమాం..