ఏమాయరా శంకరా…మా వలన ఏ తప్పిదము జరిగిందయా హరహరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

ఏమాయరా శంకరా…మా వలన ఏ తప్పిదము జరిగిందయా హరహరా…
చూస్తుంటే నీ కళ్ళ మిర మిరా చూపులను….
కాళ్ళు కంపించిపోతుంటే నీముందు నేనెట్లు నిలవగలను….
మన్నించరా శంకరా…ఏదేని తప్పుచేసుంటే  తండ్రిలా దండించరా శంకరా…!!ఏమా!!

కాసింతైన దైవభక్తి లేని ఈ కాయము..
కోరి వచ్చిందయా నీ సేవలో తరియించ పొంద నీ సాయము..
ఎంచకయా శంకరా..తప్పొప్పులెన్నెన్ని వున్నా…
కోపించకయా నీ పసిపాపలం శివన్నా.. !!ఏమా!!

జాలి గుండె గల జంగమయ్యా…
నీ కనులు ఎరుపెక్కితే చూడగలమా  చెప్పవయ్యా…
ఉపసంహరించుకోవయ్య నీ ఉగ్రరూపాన్ని…
మా కొసగుమయ్య నీ ప్రేమస్వరూప దర్శనాన్ని….!!ఏమా!!

పాహిమాం..పాహిమాం..శివశంకరా…పాహిమాం..
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top