నమో నమో దేవీ.. పరమేశ్వరీ..

ఓమ్ నమ:శ్శివాయ నమ:

నమో నమో దేవీ.. పరమేశ్వరీ..
శివహృదయ భాగతరుణీ…ప్రియ శాంకరీ…
కోరికొలుతుమమ్మా జగదీశ్వరీ…
కొంగుచాచి అడుగుతుమమ్మా… కరుణించవా మహేశ్వరీ…!!నమో!!

బొట్టు పెట్టిపిలిచాము మా ఇంటికి రావమ్మా…
పెద్దముత్తయిదువై వచ్చి అందుకోమ్మ వాయనము…
నువ్వందుకొని వాయనము కొలువుండగ మా గృహము…
నీ నవ్వుల సిరిసంపదలతో వెలుగుతున్న దేదీప్యమాన ఆలయము..
మెరిసిపోతుంటే…మా ఇల్లు స్వర్గధామమై…
నిలిచిపోవు కదా…పుడమిలోన నీ స్థిర  నివాసమై…!!నమో!!

రమణీయం..కమనీయం…నీ సుందర రూపం…
పరమ శివుని మయం… నీ హృదయం..శాంతస్వరూపం..
సగము నీవు… సగము తాను ఒకరికొకరు ఏకమై…
ఈ జగమునేలు ఏకమేను శక్తి స్వరూపమై..
పాలించవె తల్లీ…పరమపావనీ…
మమ్ము దయచూడవె తల్లీ..శివశివాని…!!నమో!!

పాహిమాం…పాహిమామ్..శ్రీ శైలపుత్రీ…
రక్షమాం…రక్షమాం..గిరిజాపతి కీర్తి..

Leave a Comment

Scroll to Top