ఓం నమ:శ్శివాయ నమ:
నాగభూషణా….నంది వాహనుడా..
దుష్ట నివారణా….భీమ శంకరుడా..
ఎన్నాళ్ళు వేచేమయా నీ దయకోసము…
కనిపించవా కలనైన ఒకసారి మాకోసము…
శంభో మహాదేవ శివ శంకరా…
ఆ వరమునొందే క్షణము ఎపుడయా గంగాధరా…!!నాగ!!
ఇల్లు వాకిలి వదలి రాలేక ఉన్నాము మేము…
ఈతి బాధల నడుమ నలిగి పోతున్నాము…
వెలుగు పంచుతూ కరిగిపోతున్నాము కర్పూరమై…
బ్రతుకు భారమై పోయి మిగిలిపోతున్నాము బంధాలకే పెనుభారమై….
ఎక్కలేక దిగలేక ఈ జీవన పరమపద సోపాన పఠములు…
అడుగుతోందయా అలసి సొలసి పోయిన ఈ తనువు పట్టుకొన నీ దివ్య పాదాలు…
కరుణించరా శంకరా..నీ కరుణ నయనాల ప్రేమలను మా పైన కురిపించరా శంకరా…!!నాగ!!
మరచిపోనిస్తావు మా వెతలనన్నీ…
అపురూప దర్శనమునిచ్చి ఆలయమునుండి….
నిజము కానిస్తావు మా కలలనన్ని…
పలుమార్లు పంపి పిలుపులను నీ మానసము నుండి…
కలత చెందిన కంట కన్నీరు రాకుండ చేసేవు…
గుండె బరువైనపుడు ఉన్నాను తోడు నీకంటూ గురుతు చేసేవు…
ఎంత బాధ్యత తీసుకుంటావయా నీవు…
మాదెంత భక్తని ప్రేమతో చూసుకుంటావయా నీవు…!!నాగ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం….రక్షమామ్..సర్వేశ్