మెరిసితివయ్యా శివయ్యా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

మెరిసితివయ్యా శివయ్యా…
హరిద్రా వర్ణమున…
స్వాగతిస్తూ వాసంతమును వసంత పంచమిన…
ఋతువులిచ్చే నీకు చేయమా క్రతువులు….
కాలగతిని మార్చే నీకు ఇవ్వమా మంగళారతులు…!!మెరిసితి!!

కావలసినవన్నీ ఇస్తావు లోకానికి..
చేయవలసినవన్నీ చేస్తావు విశ్వానికి…
ఉంచుకోవేవీ నీ సొంతానికీ…
అన్ని ఇచ్చిన నిన్ను పట్టించుకొనకున్నా పోవు పంతానికి..
దీవిస్తూనే వున్నావు యుగయుగాలుగా…
దయచూపిస్తూనే వున్నావు మా తండ్రిగా…!!మెరిసితి!!

నిదురపోతువో లేదో నిత్యమూ…
క్షణమైన విశ్రమించెదవో లేవోనని  సందేహము…
కనిపించకనే కరుణించు బంగారు సామీ…
కాసేపయిన సేద తీరకుంటే ఎట్లయా సామీ…
ఎప్పుడూ ఈ సృష్టి పైనే నీకు ధ్యాస….
ఇంకెంత బాగా సృష్టించాలనో ఈ సృష్టినని ఒకటే ఆశ….!!మెరిసితి!!

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా...పాహిమాం…
రక్షమాం.. రక్షమామ్..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top