ఓమ్ నమ:శ్శివాయ నమ:
పుట్టదా శంకరా…ఏ ప్రాణికైనా నిను చూడగనే భక్తి…
కలుగదా ఏ జన్మకైనా…నిను కొలవగనె ముక్తి…
కాదన్నవాడు కలడా ఇలలోన…
నాస్తికుడైనా ఔననక తప్పదు కడకు కలనైన!!ఏ ప్రాణి!!
చూస్తేనే చాలయా నీ నుదుటిపై నున్న విభూతి రేఖలని…
క్షణములో మార్ఛేస్తావు కర్మలను తొలగించి మా నుదుటి పై రాతలని…
మూగబోయిన గొంతు పలికినట్లు..
నేల కొరిగిన కొమ్మ చిగురించినట్లు…
నూతనోత్సాహమును మాలోన నింపి పంపేవు…
పితృవాత్సల్యము చూపి దీవించి పంపేవు…!!ఏ ప్రాణి!!
నిను మరచి బ్రతకగలదా తనువు ఈ నేలపై…
క్షణమైన ఊపిరాపి ఉండగలదా దేహము భూమిపై…
వింటూనే బ్రతికేను ప్రకృతిలో వినిపించు నీ ఓంకార నాదాలు…
చూస్తూనే ఎదిగేను నీ కనులలో వికసించు కరుణ మందార మకరందాలు…!!ఏప్రాణి!!
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…