ఏమివ్వగలవని అడగను శంకరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

ఏమివ్వగలవని అడగను శంకరా…
నీకు నేనెమవ్వగలనని కోరను..
అడగంగ నేను పరిశుద్ధుడను గాను…
కడగంగ నీ పాదాలు అర్హుడిని కాను..
శలవియ్యరా శంకరా..నీకు నీవే నాకు ఏ వరము నిత్తువో…
ఏ వరము పొంది నన్ను నీ భక్తుడననిపిస్తువో…!!ఏమివ్వ!!

నమ్మవయ్యా…నమ్ము..
నిటలాక్షా ముమ్మాటికీ నీవే మాపాలి దైవమ్ము….
వమ్ముకానీయ్యము.. నమ్ము మా మాట..
పరమేశ్వరా…ఏనాటికీ నిను మరువము నిజము…నిజమ్ము..
ఊహించగలమా నీ దయలేకుండ మా జీవితం…
భావించగలమా..నీ తోడు లేకున్న క్షణమైన గడపగలమని  మా శేష జీవితం …!!ఏమివ్వ!!

చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అట్లానే నీ రూపుని…
కనులతో ఆనంద భాష్పాలు రాల్చుతూ నిలుచుండి పోవాలనిపిస్తుంది నీ ఎదుటనే…
ఎందుకయా శంకరా…అంతలా తాకేవు మా అంతరాత్మనీ…
నీదెంత దయరా శంకరా…తాకి జన్మధన్యమును చేసేవు ఈ పరమాత్మ ఎప్పుడూ మీ వాడేననీ…!!ఏమివ్వ!!

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా....
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా...

Leave a Comment

Scroll to Top