కైలాసవాసా…హే పార్వతీశా..

ఓమ్ నమ:శ్శివాయ నమ:

కైలాసవాసా…హే పార్వతీశా..
ఎరుపెక్కనీకయ్య నీ కనులు శంకరా..
గిరిజాపతీశా…గౌరీ మహేశా…
మా మది తప్పిదములు ఎన్నున్నా మన్నించవయ్యా అభయంకరా…
మాంపాహీ……….మాంపాహీ…….
శరణందుము
నీ చరణాలె ముప్పొద్దులూ దిక్కందుము…
శంభో మహదేవా శివశంకరా…
గంగా జఠాఝూట అభయంకరా…!!కైలాస!!

మారేడు నీవనీ…
మనసున్న మా మంచి మహదేవుడు శివుడనీ…
హృదయ పూర్వకముగ నిన్ను కొలిచేమయా…
ఉదయసంధ్యల హారతులతో ప్రతి దినము స్వాగతించేమయా…
కానరా..మా భక్తి నివేదనలు…
కరుణించరా…విని మా మది మౌన ప్రార్ధనలు…!!కైలాస!!

నీ నీడలే కరుణ మేఘమాలికలలాగా…
కమ్మేసి కాపాడనీ కడవరకు కనురెప్పలాగా..
మాతోడువై మా చుట్టూ నిర్మించగా..
ప్రసరించరా నీ చల్లని చూపుల ప్రహరిని రక్షలాగా…
మరువమెన్నడు నిన్ను కాళేశ్వరా…
మారేడు దళప్రీతి మాహేశ్వరా…!!కైలాస!!

పాహిమామ్..పాహిమాం…పరమేశ్వరా..పాహిమాం ..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top