హిమగిరి నివాసా…గిరిజా పతీశా..

హిమగిరి నివాసా…గిరిజా పతీశా..
హే సుందరేశా…ఏకాంబరేశా…
శుభకరం శంకరా…నీ నిత్య దర్శనం..
దర్శించి చెందదా మా మనసు పరివర్తనం…

నీ నయనాల నీడలో మము నివసించనీయవయా…
ఆ కరుణ కిరణాలు మా పైన పడనీయ వయా…
భక్తి పారవశ్యము తో మామది ఉప్పొంగగా…
నీ భక్తి గీతాలు జాలు వారవా..ఊరికేటి గంగగా…
నీ నామస్మరణాల జడివాన లో తడిసి పోవాలి మా తనువులు…
నీ చిరుమందహాసాల హరివిల్లు లో రంగులవ్వాలి మా బ్రతుకులు…

పాహిమాం..పాహిమాం..శివా…
రక్షమాం…రక్షమాం..శివా..రక్షమాం..

Leave a Comment

Scroll to Top