మహోగ్ర రూప రౌద్ర నేత్ర హర హరా…
ప్రభాత వేళ ప్రళయ రూపమేలరా…
ధగద్దగ ద్దగ ధరణి దద్దరిల్లురా….
జగ జ్జగ జ్జగ జగము ప్రజ్వరిల్లురా…
చాలురా…తీక్షణాల వీక్షణాలు చాలురా…
హర హరా..తాళలేము ఉగ్రరూపమింక ఉపసంహరించు కొనుమురా…
పాహిమాం…పాహిమాం..పాహియనీ..
రక్షమాం..రక్షమాం..రక్షయనీ…
నీ పాదాల చేరి నిన్ను వేడమా..
నీ సేవలలో మునుగు వరము పొందమా…
స్థిరము లేని మనసు మాది కానరా…
అస్థిరములైన వాటి పైన మోజు పెంచుకొనునురా…
శాశ్వితమని నేల పైన మేను కలలు కనును రా…
అశాశ్వితమని ఎరుగక మిడిసిపాటు పడునురా…
శిక్షించకు ఆగ్రహించి దేవరా…
రక్షించుము అనుగ్రహించి శంకరా…
అఙానపు చీకట్లలో మగ్గుతున్న మనుషులం…
జ్నానా జ్యోతిని వెలిగించవయా శివా…అవుతాము నీ గుడిముందు దివ్వెలం…
పాహిమాం…పాహిమాం..శివశంకరా..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా…