శంకరా…ఇది సాహసమనుకోకురా…

శంకరా…ఇది సాహసమనుకోకురా…

నిను ప్రశ్నించేందుకు మేమెవరురా…

మా మనవిని నీ ముందుంచాము రా…

మము దయగని కరుణించాలిరా…

నాగాభరణా న్యాయమా…

గౌరీ రమణా భావ్యమా…

భీకరముగ మము కన నీకు ధర్మమా..

నిను కాదని మేము ఇలపై మనగల సాధ్యమా…

శంభో శంకర మహదేవా…నీ చరణములెన్నడు

 వదలము శివా…

పుట్టించేది నువ్వే శివా…

మము పరుగెత్తించేది నువ్వే శివా…

పడవేసేదీ నువ్వే శివా…

మేము పడితే మళ్లీ ఓదార్చేదీ నువ్వే శివా…

తెలియాలని మాకు కష్టసుఖాల విలువలు…

తెలియకనే ఆడిస్తావు మాతో పరమ పద సోపాన

 పటాల ఆటలు….

ఆటకదరా శివా…ఇది నీ ఆటనే కదరా శివా…

ఆట కదరా శివా…నీ ఆటలో మేము పావులం

 కదా శివా…

నడిపించరా శివా.. నీ ఆటలో ఎటుకైన జరిపి ఈ

 బొమ్మలని…

గెలిపించరా శివా…ఒకసారైన నీ ఆటలో

 ఓడిపోవక మా జన్మలని…

పాహిమాం..పాహిమాం..పాహిమాం..శివ శివా..

రక్షమాం..రక్షమాం..రక్షించు హర హర…

Leave a Comment

Scroll to Top