అదిగో..అల్లదిగో..విచ్చేసినాడమ్మ విఘ్నవినాయకుడు…
అరుదెంచెనదిగో…తన సుతుని రూపానా అఖిలాండ కోటి బ్రంహాండనాయకుడు….
ముద్దు గణపతియై ముదముతో మన శివుడు…
ముక్తి నొసగ మనకు వరసిద్ది గణపతియై వచ్చాడు…
హారతులివ్వరారండి..రారండి..ఈ వక్రతుండునికి…
పద కీర్తనలు వరుసగా పాడండి…పాడండి..మన ఆదిశంకరునికి….
అరుదైన దర్శనంబిది కనరండి…కనరండి బిర బిరా…
మనసార తిలకించి….ఆ తండ్రిననరండి…అనరండి…హర హరా…
మురిసిపోదా శివా…మా తల్లి గౌరీ లలామణి నీ లోన తన సుతుని చూసుకొని….
మైమరచి పోదా శివా…తన పేగు బంధాన్ని ప్రియమార తలచుకొని…
మీ ఆది దంపతుల కలల పంట..బొజ్జ గణపయ్యంట….
మా విఘ్నాలు కడతేర్చు గణనాయకుడు తానొక్కడేనంట…
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..పాహిమాం…
పార్వతి ప్రియ సుత రూప శివం రక్షమాం…రక్షమాం…