కన్నామయా శివా…కన్నామయా…

కన్నామయా శివా…కన్నామయా…

కారుణ్యమూర్తీ నిను మేము కన్నామయా…

పసుపు కుంకుమలతో తీర్ఛిన నిను మేము

 కన్నామయా…

సకల సౌభాగ్యములిచ్చి ఆదుకొమ్మని

 విన్నవించుకున్నామయా…

!!కన్నామయా!!

చుర చురా చూసేటి నీ చూపులే 

కణ కణ మండే నిప్పురవ్వలవ్వాలి…

హర హరా అని ప్రార్ధించగా మా కరములే..

మాలోని అసురగుణ శత్రువులు

 దహించబడిపోవాలి…

శంకరా…శంకరా…రారా హరా..శంభోహరా…

కాపాడరా…గంగాధరా…గౌరీవరా..

!!కన్నామయా!!

భూమిపై పడినపుడు నూలు పోగైన ఉండదు

 శివా..ఈ ఒంటిపైన…

వయసు పెరిగే కొద్ది బ్రతుకు మోడైపోయినా ఆశ

 తీరదు శివా ఈ మేని పైన….

వ్యామోహాల ప్రపంచములో విహరిస్తున్నామయా

 మము మేము మరచిపోయి…

నీ సమ్మోహన రూప దర్శనము తో మేల్కొంది

 మా మది..ఆత్మ తనది

 కాదని..పరమాత్మునిదేనని…మన్నించవోయి…

పాహిమాం..పాహిమాం..శివశంకరా…

రక్షమాం..రక్షమాం…అభయంకరా…

Leave a Comment

Scroll to Top