శివశంకరాయ శివా..పాహిమాం..
అభయంకరాయ శివా..రక్షమాం..
కోపాగ్ని కళ్ళతో వీక్షించకయా శివా పాహిమాం…
మా కళ్లు కన్నీటితో నిను
వేడుకుంటున్నాయి రక్షించవా శివా రక్షమాం…
నీకన్న దిక్కు మాకెవరయా శివా…పాహిమాం…
మా కన్న తండ్రివై మము కావవా శివా రక్షమాం…
గరిక పోచైన నీపూజకు కామా శివా మేము…
పాహిమాం…
నీ పద సన్నిధి చేర ఆనతియ్యరా శివా..మాకు
రక్షమాం…
సృష్టి స్థితి లయకారుడా శివా పాహిమాం…
నీ దృష్టి సదా మా పైన వుంచి రక్షించరా
శివా…రక్షమాం…
పాహిమాం..పాహిమాం..శివ శివ..
రక్షమాం…రక్షమాం..హర హర…