శివ శంకరా…విఘ్న వినాయక రూప అభయంకరా…

శివ శంకరా…విఘ్న వినాయక రూప అభయంకరా…
శంభో హరా..సిద్ది గణపతి రూప పరమేశ్వరా….
కమల దళముల కనులతో నిశితముగ మము వీక్షించరా…
కమలాలు తదితర ఫలములు ముందుంచినాము సేవించి రక్షించరా…
గణనాధ..గణనాధ…శివగణ నాధ..పాహిమాం…
గౌరీ సుత గజముఖ వదనా సర్వేశ్వరా శివా…రక్షమాం…

కలమెట్లు కదలునందిరా శివా…వ్రాయంగ నీ భక్తి పద కవితలను రెప్పయినా వాల్చక నిను నేను చూచు చుంటే…
స్పందించి సృష్టించమందిరా శివా నా మనసు నవ భక్తి కవితలను సెలవియ్యడా శివుడు తను తలచుకుంటే….
ప్రవాహమై ప్రవహించనీ శివా నా పాళి నుండి నీ భక్తి పద పారిజాతాలు…
శివోహమై వ్యాపించనీ శివా విశ్వమంతా ఈ వేళ నుండి ఆ భక్తి గీతాలు…
పాహిమాం…పాహిమాం…పాహిమాం..శివా….
నీ పద కీర్తనలకు మరిన్ని పదములిచ్చి కరుణించవా శివా…

Leave a Comment

Scroll to Top