శంకరా…శశిధరా..గంగాధరా…
అభయంకరా..తరలిరా…శంభోహరా…
కానరా…హరహరా…ఇది పుణ్యభూమిరా…
నీ పాదకమలాలు తాకి తానాయే ధన్య ధరణిరా…
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా..
రక్షించవా…శివా….సర్వేశ్వరా…
నిను చూచుటకు నాకు
కనులనిచ్చావు…
నిను మొక్కుటకు నాకు కరములిచ్చావు…
నీ గుడి ముందు నిలుచుటకు నాకు కాళ్లనిచ్చావు….
నీ నామ స్మరణ చేయుటకు నాకు మంచి మాట నిచ్చావు….
ఏదో ఒక లోపముతో ఈ నేలపై కలత చెందు వారు కోకొల్లలుంటే…
ఏ లోపము లేని జన్మ నిచ్చి నువు నన్ను ఆశీర్వదించినావంటే..
నీ సేవలో జీవించమని అరుదైన వరమిచ్చినావంటే…
కంట తడి ప్రార్ధనలు వినా రావు శివా మాటలు మా నోటంటే…
ఇంతకన్నా ఈ జన్మ ఇంకేమి కోరెను శివా..
ఈ వరమునే ఇస్తే మరుజన్మ నైనా కోరేము శివా…
ఇది ఆశ కాదనుకుంటే ఎన్ని జన్మలైనా నీ సేవ లోనే జీవించేము శివా…
పాహిమాం…పాహిమాం…పాహిమాం..శివా….
రక్షమాం..రక్షమాం..రక్షమాం…శివా…