విస్తుపోయేలా విశ్వనాధా విభిన్న రూపాలలో..
దర్శించగా ఉజ్జయినీ క్షేత్రాన నిను నిత్య పూజలలో…
వర్ణించనలవి కాని నిత్య అలంకరణ లతో…
స్వప్నాలు నిజమవవా శివా…నీ నిత్య దర్శనాలతో…
పాహి..పాహి..అనువారికి పక్కనుంటావు…
రక్ష..రక్ష..అనువారికి రక్షకుడినంటావు…
నుదిటిపై ఓంకార సిరిగంధము…
నెలవంక పై అమరి బహుచందము…
నీ కళ్లు మా వైపు చూడ ఏమి ఆ బంధము…
భక్తి భావనలు ఎగసిపడుతుంటే
తెగిపోవునా శివా ఈ సంబంధము…
చెప్పవా శివా ఈబంధానికి అర్ధమేమిటో…
సెలవియ్యవా శివా..ఆ సంబంధానికి పరమార్ధమెమిటో…
అక్షరం ముక్క తెలియని వారిమి శివా మేము ఆధ్యాత్మికముగా…
తీర్చిదిద్దవా శివా..మము ఆ బాటలో పయనించగా ప్రత్యేకముగా…
తెలుసుకోనివ్వు శివా..ఆ భావ తత్వాన్ని…
రుచి చూడనియవయా శివా..నీ లీలామృతాన్ని….
పాహిమాం…పాహిమాం.శివా..
రక్షమాం..రక్షమాం..శివా…