స్తుతిని చేయమా శివా…నీ సుతుని స్తుతిని చేయమా…..

స్తుతిని చేయమా శివా…నీ సుతుని స్తుతిని చేయమా…..
వ్రతము చేయమా శివా…
విఘ్నవినాయకుని వ్రతము చేయమా…

శలవియ్యవయా శివా గణపతికి..
కరుణించి వరమిమ్మని మా భక్తికి…
మాట చెవినేయవయా శివా తనకి..
మందబుద్ది గలవారము మన్నించమనటానికి…

ఉండ్రాళ్లు తింటూ “ఊ” కొడతాడేమో…
వినకుంటే తాను మము
మరచిపోతాడేమో..
బెంగ గా ఉంది గంగాధరా…
గంగనైనా పంపి చెప్పించరా..
ఆ చిన్ని కళ్ళతో వీక్షించమను గణపతిని మా మనో భక్తి సాగర గర్భాన పూజలందుకుంటున్న తన రూపాన్ని…..
చాటంత చెవులతో వినమను తనని  మా మది లోన వినిపించు “ఓం గం గణపతయేనమః ” అను చిన్న శభ్డాన్ని…
పాహిమాం…పాహిమాం..శివ..పాహిమాం..
గణేశ రూపాయ శివం…రక్షమాం…రక్షమాం..

Leave a Comment

Scroll to Top