హే..పార్వతీశా…జయ హిమగిరీశా..
స్ఫటిక లింగాకృతిని పోలు పరమేశా..
ప్రభాత పూజలను చేశాము జగదీశా…
ప్రసన్నుడివి కావయ్య సర్వేశా…
పాహిమాం..పాహిమాం..అని నీ చరణాల వేడుకొందము…
రక్షమాం..రక్షమాం..అని నీ శరణు కోరి రక్షించమందుము….!!హే పార్వతీశా!!
మంచులింగానివై వెలిసేవు సాలుకొకసారి అమరనాధానా..
వాయులింగానివై శాశ్వతముగా నిలిచావు శ్రీ కాళహస్తి నగరానా..
మల్లికార్జునునివై మము కావ శ్రీశైల శిఖరాన..
విశ్వేశ్వరునివై మోక్షమోసగ కాశీ పురాన..
ఇలలోన వెల్లివిరిసే ఎన్నెన్నో నీ పుణ్యధామాలు…
కఠినాత్ములైనా దర్శించగా పరమాత్ములగునట్లు నీ పంచరామాలు…
గరళాన్నే మింగిన గంగాధరా…
మా పాపాలనీ మింగి మము రక్షించరా..
ఏ శాపాలు తగలక మము జీవించనీ శివా..
ఏ లోపాలు లేని పూజలతో మము నిను సేవించనీ శివా…
తాదాత్మ్యత చెంది మా హృదయసీమలు…
తమకు తామే నిను స్తుతించాలి కొంగొత్త దండకములు..
పరవశించి ముదముతో చిరునవ్వు వరమిస్తే నువ్వు…
మనసాగునా శివా…నీ పదములపై పడక కరుణిస్తే నువ్వు…
పాహిమాం…పాహిమాం…శివశంకరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…గిరిజాపతీ రక్షమాం..